PM Modi: అహ్మదాబాద్‌లో మోదీ రోడ్‌షో.. తరలివచ్చిన జనం
అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. నరోడా నుంచి నికోల్ వరకు సాగిన ఈ రోడ్‌షోకు వేలాది మంది హాజరై స్వాగతం పలికారు. అనంతరం ఖోడల్ధామ్ గ్రౌండ్‌లో జరిగే సభలో మోదీ రూ.5,477 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అహ్మదాబాద్ నగరంలో సోమవారం (ఆగస్టు 25, 2025) సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన అహ్మదాబాద్ చేరుకోగా, విమానాశ్రయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నరోడా ప్రాంతానికి చేరుకున్న ప్రధాని, హరిదర్శన్ క్రాస్‌రోడ్స్ నుంచి నికోల్‌లోని ఖోడల్ధామ్ గ్రౌండ్ వరకు దాదాపు 2 కిలోమీటర్లపాటు రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షో మార్గమంతా ఇరువైపులా వేలాది మంది ప్రజలు కేరింతలతో మోదీకి స్వాగతం పలికారు. రోడ్‌షో అనంతరం ఖోడల్ధామ్ గ్రౌండ్‌లో ప్రజాసభలో పాల్గొని… రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..