శివరాత్రి వేళ ఆంజనేయుని జాతర.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..

| Edited By: Srikar T

Mar 09, 2024 | 3:04 PM

తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులు, మేళ తాళాలు, డబ్బు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు వైభవంగా జాతరను జరిపారు. జాతరలు అధికంగా గ్రామ దేవతలకు చేస్తుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం ప్రతి ఏటా కన్నులపండువగా నిర్వహిస్తారు. శివరాత్రి నేపథ్యంలో ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.

తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులు, మేళ తాళాలు, డబ్బు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు వైభవంగా జాతరను జరిపారు. జాతరలు అధికంగా గ్రామ దేవతలకు చేస్తుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం ప్రతి ఏటా కన్నులపండువగా నిర్వహిస్తారు. శివరాత్రి నేపథ్యంలో ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ 74వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ జాతరలో బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుత్ అలంకరణతో కడియపులంక గ్రామం అంతటా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతేగాక ఈ ఏడాది ఆంజనేయ స్వామి ఆలయమంతా వివిధ రకాల పండ్లు, పుష్పలతో అద్భుతంగా ముస్తాబు చేసారు. అలాగే కడియపులంక శివాలయం విద్యుత్ అలంకరణతో కనువిందు చేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on