COVID-19 Effect: కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?

Updated on: Sep 18, 2024 | 1:11 PM

కోవిడ్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ జనాల్ని వెంటాడుతున్నాయా..? అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వ సాధారణమైపోయిందా..? గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ తరహా చర్చలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ జనాల్ని వెంటాడుతున్నాయా..? అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వ సాధారణమైపోయిందా..? గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ తరహా చర్చలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురికాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. రాత్రి అల్కాపురి కాలనీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండెపోటుతో మృతి చెందారు. అల్కాపురి టౌన్‌షిప్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం దగ్గర లడ్డూ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్‌మార్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యామ్‌ ప్రసాద్‌ ఒక్కసారి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు.. ఆయన కూడా లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. 15 లక్షల వరకు లడ్డూ వేలం‌ పాట పాడారు శ్యామ్‌ప్రసాద్‌. చివరికి స్నేహితుడు అతని కన్నా ఎక్కువ మొత్తానికి పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అందరితో కలిసి సరదగా డాన్సులు చేశారు శ్యామ్. కానీ కాసేపటికి ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. నిజానికి కోవిడ్ తర్వాత వస్తున్న ఈ...