ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

Updated on: Feb 01, 2026 | 4:09 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీక్ అయింది. గతంలో జరిగిన భారీ ప్రమాదాల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్‌లైన్ నుండి గ్యాస్ లీకేజీతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు సమాచారం అందింది. లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తక్షణమే చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద డ్రిల్లింగ్ సైట్‌లో భారీ గ్యాస్ లీకేజీ (బ్లో అవుట్) సంభవించి, దానిని అదుపులోకి తీసుకురావడానికి సిబ్బందికి రోజుల తరబడి సమయం పట్టింది. అలాగే, జనవరి 6న మోరీ 5 బ్లాక్ దగ్గర జరిగిన గ్యాస్ లీకేజీ కూడా మొదట చిన్నదిగా కనిపించినా, తర్వాత పెద్ద బ్లో అవుట్‌గా మారి ప్రజలు ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు

వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us