Delhi: పాన్‌ మసాలా కోటీశ్వరుడి ఇంట్లో విషాదం

Updated on: Nov 28, 2025 | 12:59 PM

కమలా పసంద్, రాజ్‌శ్రీ పాన్ మసాలా అధినేత కమల్ కిశోర్ చౌరాసియా కోడలు దీప్తి చౌరాసియా ఢిల్లీలోని వసంత్ విహార్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో సంబంధాలలో నమ్మకం లేదని రాసి ఉంది. కుటుంబ సమస్యలు కారణమని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

పాన్ మసాలా బ్రాండ్లు ‘కమలా పసంద్’, ‘రాజ్‌శ్రీ’ అధినేత కమల్ కిశోర్ చౌరాసియా ఇంట్లో దారుణం జరిగింది. ఆయన కోడలు దీప్తి చౌరాసియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన వసంత్ విహార్‌లోని వారి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కమల్ కిశోర్ కుమారుడు అర్పిత్‌తో దీప్తికి 2010లో వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోని గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఉన్న దీప్తిని ఆమె భర్త అర్పిత్‌ గమనించారు. వెంటనే ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో పోలీసులకి సూసైడ్ నోట్ లభించింది. “ఒక బంధంలో ప్రేమ, నమ్మకం లేనప్పుడు ఆ జీవితానికి అర్థం ఏముంటుంది?” అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదని ఆమె రాసినట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై చౌరాసియా కుటుంబం కానీ, పోలీసులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాన్పూర్‌లో ఒక చిన్న దుకాణంతో పాన్ మసాలా వ్యాపారం ప్రారంభించిన కమల్ కిశోర్, ప్రస్తుతం వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం… ఏపీలో అతి భారీ వర్షాలు

Andhra King Taluka Review: అక్కడ బిగిస్తే.. సినిమా మరోలా ఉండేదేమో..?

Published on: Nov 28, 2025 09:30 AM
Follow Us