OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
ఈ వారం థియేటర్లలో ‘నాగ బంధం’, ‘రావు బహదూర్’, ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఓటీటీల్లో మాత్రం ‘అబ్సెషన్’, ‘సూపర్ సుబ్బు’, ‘ఇసకపట్నం’, ‘మాలీవుడ్ టైమ్స్’తో పాటు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వీకెండ్‌కు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ లో నాగ బంధం, రావు బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాల నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు ఆర్ ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్ర లో నటించిన అల్ట్రా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా ఈ వారంలోనూ థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ దృష్టి మొత్తం ‘అబ్సెషన్’ మూవీ పైనే ఉంది. వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పెద్ది’ కూడా ఈ వారంలోనే డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’, ఐశ్వర్య రాజేశ్ ‘ఇసకపట్నం’ లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇక ఓటీటీల వారిగా చూస్తే
ఆహా ఓటీటీలో…
టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) – జూలై 03
నెట్‌ఫ్లిక్స్
సూపర్ సుబ్బ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 02
పెద్ది (తెలుగు సినిమా) – జూలై 02 (రూమర్ డేట్)
ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 02
హ్యుమన్ వెపర్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 02
స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 05
అమెజాన్ ప్రైమ్ వీడియో
అబ్సెషన్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 30 (రెంటల్ బేసిస్)
ఎల్లే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 01
ఇసకపట్నం (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 02
జీ5 ఓటీటీలో
మర్మదేశం (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 03
ముతస్సీ (మలయాళ వెబ్ సిరీస్) – జూలై 03
జియో హాట్‌స్టార్
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 03
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూలై 03
సన్ నెక్స్ట్
హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) – జూలై 03
ఆపిల్ టీవీ ప్లస్
సిలో సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 03
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

