Oscars 2023 BIG Pre Release Event: మేం చూపిస్తాం.. మన నాటుపాట హాలీవుడ్‌లో చేస్తున్న వీరంగం.. TV9 Live

|

Mar 12, 2023 | 7:22 PM

ప్రపంచ వేదికపై తెలుగు వెలుగులు..వరల్డ్‌ వైడ్‌గా ప్రభంజనం సృష్టిస్తోంది మన తెలుగు పాట నాటునాటు సాంగ్‌. మరికొద్దిగంటల్లోనే అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభంకాబోతోంది ఆస్కార్‌ సంబరం. అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో నిలిచింది నాటునాటు సాంగ్‌. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేట్‌ అయిన నాటునాటుకు ఆస్కార్‌ అవార్డ్‌ ఖాయమంటూ హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్‌.

మేం చూపిస్తాం.. మన నాటుపాట హాలీవుడ్‌లో చేస్తున్న వీరంగం మేం చూపిస్తాం.. మన పొలంగట్టు పాట..డాల్బీ థియేటర్‌ సెవులు సిల్లు పడేలా చేస్తున్న యవ్వారం మేం చూపిస్తాం..ఆస్కార్స్‌లో తెలుగు సినిమా విశ్వరూపం. ప్రపంచమంతా ఆస్కార్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ముఖ్యంగా మన తెలుగు సమాజంలో. ఆస్కార్ అనే పదానికి మనకూ చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు అదోరకం ఫీలింగ్. ఆస్కార్ అంటే ఆకాశం. కనిపిస్తుంది… కళ్లను మెరిపిస్తుంది… ఆ అమృత కలశం చేతికందే ఘడియలు మన ముందున్నాయి. ఆస్కార్‌ అనే అద్భుత ఘట్టానికి చేరుకున్నాం… ఒకే ఒక్క అడుగు… అంటూ మనల్ని చెయ్యి పట్టి తీసుకెళ్తున్నారు జక్కన్న. ఎస్… ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చే బాధ్యతను ఈసారి మన తెలుగోడే తీసుకున్నాడు. ఎంఎం కీరవాణి… ఇప్పుడది పేరు మాత్రమే కాదు. ఆస్కార్ వినువీధుల్లో మన పతాకను ఎగరేస్తున్న తెలుగోడి బ్రాండ్. కోట్లాదిమంది భారతీయుల బంగారు కలల్ని తన కలలుగా చేసుకుని సాకారం చేసుకున్న సాధకుడు కీరవాణి. మూడు దశాబ్దాలకు పైగా ఆయన సంగీతంతో చేసిన సావాసం… ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని ఖండాంతరాల్ని దాటించేంది.

Published on: Mar 12, 2023 07:14 PM