Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

Updated on: Nov 11, 2025 | 4:51 PM

భారత్ రక్షణ రంగంలో కొత్త అధ్యాయం సృష్టించింది. దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది. 'ఆపరేషన్ సింధూర్'లో బ్రహ్మోస్ క్షిపణులు నిరూపించుకున్న సత్తాతో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో సహా 14-15 దేశాలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ క్షిపణి ప్రపంచ మార్కెట్లో భారత్ స్థానాన్ని పటిష్టం చేస్తోంది.

రక్షణ రంగంలో భారత్‌ సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోంది భారత్‌. రక్షణ రంగ పరికరాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి వరకు ఎదిగింది. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్‌పై భారత్‌ జరిపిన ఆపరేషన్ సింధూర్‌ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఆపరేషన్‌లో భారత్‌ స్వయంగా అభివృద్ది చేసిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు దేశాలనే కాదు.. మిత్ర దేశాలను సైతం ఆశ్చర్యపరిచాయి. వాటి పనితీరును యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించింది. వాటి కచ్చితత్వం, సృష్టించిన విధ్వంసాన్ని ప్రపంచం కళ్లారా చూసింది. దీంతో బ్రహ్మోస్‌ క్షిపణులు మాకూ కూడా కావాలంటూ పలు దేశాలు భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే.. ఫిలిప్పీన్స్‌ – భారత్ మధ్య ఒప్పందం కుదరగా, ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు దాదాపుగా కొలిక్కివచ్చి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కన్నా మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు.​ భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంలో క్షిపణి రూపకల్పన జరిగింది.​ నేల, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించవచ్చు.​ పరిధి కనీసం 290 కి.మీ నుంచి తాజాగా 650-800 కి.మీ వరకు పెంచారు. భవిష్యత్తులో 1500 కి.మీ వరకూ లక్ష్యాలను ఛేదించగలదు.​ అడ్వాన్స్‌డ్ గైడెన్స్, నావిగేషన్ ద్వారా లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది.​ రాడార్లు కూడా పసిగట్టలేని విధంగా దూసుకుపోగలవు. 200 కిలోలు నేల, సముద్రం మీద 200 కిలోలు, కిలోలు విమాన ప్రయోగానికి 300 కిలోల వార్ హెడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రయోగించిన తర్వాత మనిషి ప్రమేయం అవసరం లేని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ టెక్నాలీ దీని సొంతం. చివరి దశలో వేగంగా దిశ మార్చుకుని లక్ష్యాన్ని ఛేదించే టెక్నిక్.​ అన్ని వాతావరణాల్లో.. పగలు, రాత్రి సమయంలోనూ పని చేయగల సామర్థ్యం ఉంది. భారతదేశం ఫిలిప్పీన్స్‌తో సుమారు ₹3500 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రకారం క్షిపణులు, అవసరమైన ఇతర ఆయుధ వ్యవస్థలను అందిస్తుంది. ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కోసం అనేక దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇండోనేషియా చాలా కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియాకు చెందిన అత్యున్నత రాజకీయ, సైనిక నాయకత్వం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బ్రహ్మోస్ గురించి చర్చించింది. తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆ దేశానికి మరింత నమ్మకాన్ని కలిగించింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత 14-15 దేశాలు బ్రహ్మోస్ కోసం అడిగినట్లు రక్షణ మంత్రి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌