నెల రోజుల పాటు ఉదయాన్నే ఈ నీరు తాగండి.. ఫలితం మీరే చూడండి

Updated on: Nov 09, 2025 | 1:36 PM

కాస్త జలుబు చేసిందంటే చాలు... సొంఠి, మిరియాలువేసి పాలు తాగించేస్తుంది అమ్మ. దానికి దగ్గూ జ్వరం కూడా తోడయిందంటే... ఏకంగా లవంగాలూ చెక్కా దనియాలూ అన్నీ కలిపి మరిగించిన కషాయాన్ని బలవంతంగా అయినా పట్టించేస్తుంది. అలాగే కూరలు, బిర్యానీల్లో ఒక్కోదానికీ ఒక్కో రకం గరం మసాలా దంచి వేయడం మామూలే.

ఇలా వంటల్లోనూ గృహవైద్యంలోనూ భాగమైన ఆ మసాలా దినుసుల్లో దేని ఘాటు దానిదే. దేని రుచి దానిదే. అటు వంటకాలకు రుచినీ ఇటు ఒంటికి ఆరోగ్యాన్నీ అందించే సుగంధద్రవ్యాలను వానాకాలంలోనే కాదు, చలికాలంలోనూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు అంటోంది ఆయుర్వేదం. ఈ సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ చేసే మేలుగురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయలో యాంటీ బయోటిక్, యాంటీ ఫార్మాస్యూటికల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, కాపర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని పోషకాలు కలిగిన ఈ జాజికాయ పొడిని నీటిలో కలుపుకొని ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పొట్ట సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ వంటి తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జాజికాయ నీటిని తాగడం ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఔషధంగా చెబుతారు. జాజికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతాయి. మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జాజికాయ నీటిని తాగడంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. లేదా ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు

సముద్ర తీరంలో వింత జీవులు..

Health: శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే

స్కూలుకి వెళ్లనని చిన్నారి మారాం.. పేరెంట్స్‌ ఏం చేశారో చూడండి