Nirmal : నిర్మల్ జిల్లాలో వరద పరిస్థితి ఎలా ఉందంటే..?

Updated on: Aug 28, 2025 | 9:16 AM

నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఆరు కాలనీలు జలమగ్నమయ్యాయి. ఎస్పీ జానకి శర్మ నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు పది మందిని పైగా రక్షించారు. అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల..

నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. సుమారు ఆరు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్పీ జానకి శర్మ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు పది మందికి పైగా వరద బాధితులను కాపాడారు. ముంపల్లి ప్రాంతంలో ఒక పశువుల కాపరి వరదలో చిక్కుకున్నాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.