వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి

Updated on: Oct 16, 2025 | 7:14 PM

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌. అవును, ఇకపై రోడ్ల మీద ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఎలాపడితే అలా వెళ్తామంటే కుదరదు. ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడుపుతూ, ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేసినా ఖాతరు చేయకుండా.. వాటిని చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచి అడిగినప్పుడు చూద్దాంలే అనుకునే వారి ఆట కట్‌. కేంద్ర రవాణాశాఖ వాహన చట్టాన్ని సవరించింది.

ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతను పాటించని వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు వేయడమే కాదు… వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, లేదంటే వాహనం విక్రయించాలనుకునే సమయంలో చర్యలు తీసుకోవడం చేసే ఛాన్స్‌ ఉంది. ఫలితంగా మీరు వాహనాన్ని విక్రయించలేకపోవచ్చు. కనుక బీ కేర్‌ఫుల్‌. కరీంనగర్‌ జిల్లాలో 1.92 లక్షల కుటుంబాలు, 5.7 లక్షల జనాభా నివసిస్తోంది. మారుతున్న కాలానికి తగ్గట్లుగానే ప్రజల్లో వాహన వినియోగం పెరిగింది. జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1.46 లక్షల ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలే ఎక్కువ. ఇక్కడి వరకు భాగానే ఉన్నా రహదారి భద్రతా నియమాలను పాటించడంలో వాహనదారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఏటా పెరుగుతున్న చలాన్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హెల్మెట్‌ ధరించకపోవడం, మైనర్‌ డ్రైవింగ్, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు తేలింది. కొందరు నంబర్లు తొలగించి వాహనాలు నడుపుతున్నారు. నిత్యం పోలీసులు, రవాణాశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నా మార్పు కనిపించడం లేదు. కేంద్ర రవాణాశాఖ నిబంధనల ప్రకారం వాహనానికి వేసిన చలాన్లు.. అయిదు కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉండి వాహనం పోలీసులకు చిక్కితే.. రవాణాశాఖ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి లైసెన్సులు కూడా రద్దు చేసే అధికారం కల్పించింది. రవాణాశాఖ ఆ వాహనంపై ఎలాంటి లావాదేవీలకు అనుమతించదు. దీనివల్ల వాహనం విక్రయ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోటో పెట్టు.. రూ.1000 పట్టు

రూ.18 లక్షల బాహుబలి గుమ్మడి.. బరువు 1064 కేజీలు

భగ్గుమన్న బంగారం-తగ్గిన వెండిగురువారం ధరలు ఎలా ఉన్నాయి

Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్

సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు