తెలంగాణలో రేషన్‌ కార్డు దారులకు అలర్ట్..

Updated on: Jan 23, 2025 | 3:16 PM

తెలంగాణలోని రేషన్‌ కార్డు దారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. కోడిగుడ్డులోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకొని రేషన్‌ షాపుల్లో గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్‌ ఎగ్‌ చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా రేషన్‌ షాపుల్లో పప్పులు, బియ్యం, నూనెలు వంటి నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తుంటారు.

అయితే గుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్‌ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని ఎన్‌ఈసీపీసీ కోరుతోంది. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 6 గుడ్లు, అంగన్‌వాడీల్లో గర్భిణులకు రోజుకు 2 గుడ్లు, పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు 30 గుడ్లు ఇస్తున్నారు. ​రేషన్‌ కార్డు ద్వారా ప్రజలకు కూడా నెలకు కనీసం 30 గుడ్లు అందిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, అంగన్‌వాడీల్లో విద్యార్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తుంది. ఒక వేళ సర్కార్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే రేషన్ కార్డు దారులకు కూడా ఉచితంగా ఇస్తారా? లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా? అనేది తేలుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్‌ ఛైర్‌లో ఇలా..

పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్‌

Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో సోదాలు

డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష

ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు