చుండ్రు వేధిస్తోందా.. ఇలా చేయండి

Updated on: Jul 25, 2025 | 1:40 PM

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది. ఎన్ని రకాల షాంపూలు వాడినా చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.? ఎలా ఉపయోగపడతాయి.? కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి తలకు మసాజ్ చేయండి.

20 నిమిషాలు అలాగే ఉంచండి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. చుండ్రుకు చెక్ పెట్టే మరో మొక్క.. కలబంద. దీనిని పలు రకాల ఫేషియల్ క్రీముల తయారీలోనే గాక..పలు ఔషధాల తయారీలోనూ వీటిని వాడతారు. పెరుగులో అలోవెరా జెల్‌ కలిపి తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత వాష్‌ చేస్తే.. చుండ్రు సమస్య నెమ్మదిస్తుంది. ముందుగా షాంపూ చేసుకుని, తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్, నీళ్లు సమాన మోతాదులో కలిపి తలకు అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే .. చుండ్రు సమస్య తొలగిపోతుంది. అలాగే.. రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం పేస్ట్‎లా చేసుకుని, తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దురద, పొట్టు తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. షాంపూలో కొన్ని చుక్కల టీ.. ట్రీ ఆయిల్ కలిపి తల స్నానం చేయడం వల్ల దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు నివారణకు సహజంగా చికిత్స చేయడానికి, అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాసేపట్లో అంత్యక్రియలు.. దగ్గుతూ లేచి కూర్చున్న మృత దేహం

వీధి కుక్క దాదాగిరీకి నెటిజన్లు ఫిదా

ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్‌కు బయలుదేరిన భగీరా.. వీడియో చూస్తే షేకే

రూ.4.3 కోట్ల కారు కొని… ఇంట్లో వేలాడదీశాడు

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..