Andhra: పొద్దుపొద్దునే రోడ్డుపై ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా

Edited By: Ram Naramaneni

Updated on: Jul 25, 2025 | 7:16 PM

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఓ ప్రధాన రహదారి పక్కన చేతబడి సామగ్రి కనిపించి భయాందోళన నెలకొంది. మట్టితో తయారైన బొమ్మ, నిమ్మకాయ, కుంకుమ, చిల్లరతో కూడిన మంత్రాల పదార్థాలు చూసిన స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పక్కనే ఉన్న స్కూల్‌కి వెళ్లే చిన్నారుల తల్లిదండ్రులు మరింత హైరానా పడుతున్నారు.

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోనీ దొరకోటకు వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం ఉదయం చేతబడి కలకలం రేపింది. చేతబడి చేసిన చోట.. ఇళ్లలో డబ్బులు పోగు చేసుకోవడానికి వినియోగించే మట్టి డిబ్బి సగం పగలగొట్టి అందులో చిల్లర,పూలు, ఒక ప్లాస్టిక్ గ్లాసులో కుంకుమ,నిమ్మకాయ.. మట్టితో తయారుచేసిన ఆడ మనిషి బొమ్మ ఉండటం ఆ ప్రాంతవాసులను భయాందోళనకు గురి చేసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యక్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము చాలా కాలంగా ఉంటున్నామని.. ఇలా గతంలో చేసిన దాఖలాలు లేవన్నారు.   స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాల ఉందని.. ఆ స్కూల్‌కు వెళ్లే పిల్లలు.. ఇతరులు వందల మంది తిరిగే ఈ ప్రాంతంలో ఇలాంటి చేతబడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి