రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్‌ అధికారులు ఏం చేశారంటే

Updated on: Sep 11, 2025 | 6:01 PM

రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమానికి మున్సిపల్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అస్సాంలోని టిన్సుకియాలో ఈ ఘటన జరిగింది. డైలీ బజార్ ప్రాంతంలోని ఒక షాపు యజమాని ప్రతి రోజూ రోడ్డుపై చెత్త పడేస్తున్నాడు. రాత్రివేళ షాపు మూసే సమయంలో ఇలా చేస్తున్నాడు.

సోమవారం రాత్రి 9:30 గంటలకు కిరాణా, గిఫ్ట్‌ వస్తువుల షాప్‌ ఉద్యోగి అక్కడి రోడ్డుపై చెత్త పడేశాడు. రాత్రివేళ విధుల్లో ఉన్న టిన్సుకియా మున్సిపల్ సిబ్బంది ఇది చూశారు. రోడ్డుపై చెత్త వేస్తున్న ఆ ఉద్యోగిని ప్రశ్నించారు. ఏ షాపులోని చెత్తను అతడు పడేస్తున్నాడు అన్నది తెలుసుకున్నారు. అయితే ఎలాంటి జరిమానా విధించలేదు. మరోవైపు మరునాడు ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆ షాపు వద్దకు చేరుకున్నారు. బుల్డోజర్‌లో తెచ్చిన చెత్తను ఆ షాపు ముందు పడేశారు. పారతో చక్కగా ఆ షాపు ముందు చెత్తను పరిచారు. రోడ్డుపై చెత్త పడేస్తున్న ఆ షాపు యజమానికి ఇలా బుద్ధిచెప్పారు. షాపు యజమాని పదే పదే ఈ తప్పు చేస్తున్నాడని, అందుకే ఇలా గుణపాఠం చెప్పినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ‘పట్టణం పరిశుభ్రత కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని టిన్సుకియా మున్సిపల్ బోర్డు చైర్మన్ పులక్ చెటై మీడియాతో అన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అట్టుడుకుతున్న నేపాల్‌.. హింసకు అసలు కారణం అదేనా?

Bigg Boss 9: సంజన Vs లక్స్‌ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!

కూటమి ఐక్యతను చాటిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ

వినాయకుడి అన్నదానంలోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానం

CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్