థాయిలాండ్‌లో ధోని హల్ చల్.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?
2026 సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా స్వాగతించారు. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌లో నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. ధోనీ కొత్త ఏడాది వేడుకల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ధోనీ థాయిలాండ్‌లో ఎవరితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు? అని నెటిజన్లు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.
ధోని తన కుటుంబంతో కలిసి థాయిలాండ్‌లోని పుకెట్‌లో నూతన సంవత్సరాన్ని స్వాగతించాడు. ఈ ప్రత్యేక సందర్భంలో అతని భార్య సాక్షి, కుమార్తె జివా కూడా అతనితో కలిసి కనిపించారు. ఈ వేడుకల ఫోటోలను ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 2026 ధోనికి చాలా స్పెషల్ కానుంది. ఈ ఏడాది ధోనీ ఐపీఎల్‌లో ఆడటం అతని చివరిసారి కావచ్చు. క్రికెట్ అభిమానులు ధోనిని ఆటలో చూసే చివరి సంవత్సరమూ ఇదే కావచ్చు. ఈ సంవత్సరం, అతను తన రిటైర్మెంట్ గురించిన ఊహాగానాలకు ముగింపు పలకుతాడనే అంచనాలున్నాయి. గతంలో కూడా ఎంఎస్ ధోనీ థాయిలాండ్‌లో తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.అక్కడ ఫుటెక్‌లోని బీచ్‌లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం :
