మరో అల్పపీడనం మూడు రోజులు భారీ వర్షాలు

Updated on: Nov 01, 2025 | 8:27 AM

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం..  గురువారం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది.

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ కేంద్ర హెచ్చరికల ప్రకారం..  గురువారం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బీహార్ మీదుగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సహా పలు తీర ప్రాంత జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజల జీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఈ తుఫాన్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా మరోసారి వర్షాల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రకాశం బ్యారేజ్‌కు తప్పిన పెను ప్రమాదం

భీమవరం అంటే‌.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ మాత్రం ఉండాల్సిందే