భారత్ లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర

Updated on: Dec 10, 2025 | 5:32 PM

భారత్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్లు, అమెజాన్ 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ప్రకటించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి రంగాలపై ఈ పెట్టుబడులు కేంద్రీకృతమయ్యాయి. ఈ పరిణామాలు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

భారత్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బడా కంపెనీలు దేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధమయ్యాయి. ఒకే రోజు రెండు దిగ్గజ సంస్థలు తమ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేయడం విశేషం. అమెజాన్ భారత్‌లో 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంపై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు..

కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..

మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు

Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా