Hyderabad: మొట్టమొదటి సారిగా ట్యాంక్‌బండ్‌పై 9 విమానాలతో విన్యాసాలు.. ఎప్పుడంటే..!
Hyderabad: హైదరాబాదులో చాలా ఎయిర్ క్రాఫ్ట్ షోలు సిటీకి దూరంగా నిర్వహించారు. నగరం నడిబొడ్డున సచివాలయం ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్లో ఏర్ షో నిర్వహించడం ఇదే మొదటిసారి..
ప్రజా పాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా రోజుకో శాఖ మీద ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ్‌లో ఉన్న హుస్సేన్ సాగర్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల షో నిర్వహించబోతున్నారు. ఈ షో మొత్తం సెలబ్రేషన్స్ కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతుంది. సూర్య కిరణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫార్మేషన్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ ట్రాట్లతో ట్యాంక్బండ్పై విన్యాసాలు చేయనుంది.
హైదరాబాదులో చాలా ఎయిర్ క్రాఫ్ట్ షోలు సిటీకి దూరంగా నిర్వహించారు. నగరం నడిబొడ్డున సచివాలయం ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్లో ఏర్ షో నిర్వహించడం ఇదే మొదటిసారి. సూర్య కిరణ్ ఏరోబిక్ టీం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ బేస్ క్యాంపుకు చెందిన టీం. అబ్బురపరిచే విన్యాసాలు చేయటంలో వీరికి వేరే సరిసాటి. 9 ఎయిర్ క్రాఫ్ట్ లు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుంటూ అతి దగ్గరగా అంటే కేవలం ఐదు మీటర్ల డిస్టెన్స్‌లో ఒకదానికొకటి దగ్గరగా ఎగురుతూ పల్టీలు కొడుతూ రకరకాల ఫీట్లు చేయనున్నాయి.
తెలుపు ఎరుపు రంగులో ఉండే చిన్న 9 ఎయిర్ క్రాఫ్ట్ లు ఆకాశంలో వివిధ ఆకారాల్లో పల్టీలు కొడుతూ విన్యాసాలు చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనేలా ఎయిర్ షో ఉండేలా ప్లాన్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు తొమ్మిది హెయిర్ కట్ తో టెస్ట్ ట్రయల్ నిర్వహించిన వైమానిక ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అద్భుతమైనఎయిర్ షో నిర్వహించనుంది.