Manchu Manoj – Mounika: మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.!
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయాడు మనోజ్. పర్సనల్ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నాడు హీరో మనోజ్. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు.
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయాడు మనోజ్. పర్సనల్ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నాడు హీరో మనోజ్. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు. తన సేవా కార్యక్రమాలతో అందరి మనసు గెలుచుకుంటున్నారు. గతంలో పలు సార్లు అనాథ పిల్లలు, విద్యార్థులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు మంచు మనోజ్. ఇప్పుడు మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. మౌనిక గర్భం ధరించడంతో తాజాగా హైదరాబాద్‌లోని ఓ అనాథశ్రమానికి వెళ్లాడు మనోజ్. అక్కడి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా భార్యతో కలిసి స్వయంగా పిల్లలకు భోజనాలు వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇక దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మనోజ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు గ్రేట్ అన్నా, మీకు అంతా మంచే జరగాలి’ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos