క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం

Updated on: Oct 16, 2025 | 7:59 PM

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెను ప్రమాదమే తప్పింది. నగరంలోని ఓ ప్రధాన రోడ్డు అందరూ చూస్తుండగానే.. 30 అడుగుల మేర కుంగిపోయింది. ఆ టైంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇండోర్, హోషంగాబాద్, జబల్పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ..మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించింది.

ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య మాండీదీప్ నుంచి ఇట్‌ఖేడి వెళ్లే వంతెన దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 100 మీటర్ల రోడ్డు ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. ఈ సంఘటన తర్వాత ఆ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందుతుందా లేదా అనే దానిపై మొదట్లో గందరగోళం నెలకొంది. అయితే ఆ మార్గం తమ అధికార పరిధిలోకి రాదని NHAI అధికారులు స్పష్టం చేశారు. సుఖి సెవానియా ప్రాంతంలోని విలేజ్ కళ్యాణ్‌పూర్ రైల్వే వంతెనకు దాదాపు 100 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని, మొత్తం రోడ్డు MPRDC అధికార పరిధిలో ఉందని ఒక అధికారి తెలిపారు. ఈ సంఘటన తర్వాత, మధ్యప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి రాకేష్ సింగ్ చేసిన ప్రకటన వార్తల్లో నిలిచింది. “రోడ్డు అన్న తర్వాత గుంతలు కామన్. అసలు గుంతలే పడని విధంగా రోడ్ వేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. నాలుగేళ్లు పనిచేయాల్సిన రోడ్.. ఆరునెలల్లో పాడయితే ఆందోళన పడాలి తప్ప.. ఇందులో మరేమీ లేదు’అని ఆయన వ్యాఖ్యానించారు. రహదారి కూలిపోవడానికి గల కారణాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో రీఎన్‌ఫోర్స్డ్ ఎర్త్ (RE) గోడ కూలిపోవడం వల్ల జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తు నివేదిక విడుదలైన తర్వాత ప్రమాదానికి గల కారణం స్పష్టమవుతుందని MPRDC డివిజనల్ మేనేజర్ సోనాల్ సిన్హా మీడియాకు తెలిపారు. ఈ వంతెన 2013లో నిర్మించారు. అయితే, నిర్మాణ సంస్థ M/s ట్రాన్స్‌స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌ టెండర్‌ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ఏ సంస్థ కూడా పర్యవేక్షించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక.. రైలు టికెట్ ఇంటికే డెలివరీ

జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్‌

ఇక.. సులభంగా ఈపీఎఫ్‌ విత్‌ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు

ఆదరణకు నోచుకోని ఆదుర్రు స్తూపం

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి