కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం

|

Jan 24, 2024 | 1:01 PM

అయోధ్య రామమందిరం కోసం ఎందరో ఎన్నో ప్రతినలు బూనారు. 500 ఏళ్ల కల నెరవేరుస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడం, అందులో బాలరామచంద్రుడు కొలువుదీరడంతో యావత్‌ హిందూ ప్రపంచం ఆనందంలో మునిగిపోయింది. తాజాగా రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ అయోధ్యలో రామమందిరం నిర్మించినట్లే మథురలో కూడా శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని, అప్పటివరకూ తాను ఒక్కపూటే భోజనం చేస్తానని ప్రతిజ్ఞచేశారు.

అయోధ్య రామమందిరం కోసం ఎందరో ఎన్నో ప్రతినలు బూనారు. 500 ఏళ్ల కల నెరవేరుస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడం, అందులో బాలరామచంద్రుడు కొలువుదీరడంతో యావత్‌ హిందూ ప్రపంచం ఆనందంలో మునిగిపోయింది. తాజాగా రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ అయోధ్యలో రామమందిరం నిర్మించినట్లే మథురలో కూడా శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని, అప్పటివరకూ తాను ఒక్కపూటే భోజనం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడుగా ఉన్న మదన్‌ దిలావర్‌ అనేక ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఎట్టకేలకు రామమందిరం నిర్మాణం జరగడంతో రాముని విగ్రహప్రతిష్ఠాపన రోజును తాను చేసిన ప్రతిజ్ఞను వీడారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం మాలను ధరించి సోమవారం దీక్షను విరమించారు. ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్‌ దిలావర్‌ మరో ప్రతిన బూనారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఎందుకు వెళ్లలేదో తెలుసా ??

అయోధ్య వృద్ధిని అంచనా వేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్ సంస్థ

KTR: అదిరిన కేటీఆర్ కొత్త లుక్.. నెట్టింట ఫోటో వైరల్

తల్లి పక్కన పడుకుని మొబైల్‌లో కార్టూన్లు చూస్తున్న చిన్నారి.. ఒక్క సారిగా..

Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్