కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..

Updated on: Jan 01, 2026 | 4:41 PM

ఈ ఆర్టికల్ బానపొట్టను సులభంగా తగ్గించుకోవడానికి నిపుణులు సూచించిన ప్రత్యేకమైన వాకింగ్ పద్ధతులను వివరిస్తుంది. వేగంగా, నెమ్మదిగా నడవడం, ఎత్తైన ప్రదేశాలపై వాకింగ్, బరువులు మోస్తూ నడవడం, సరైన శరీర భంగిమ, మెట్లు ఎక్కడం వంటివి పాటించడం ద్వారా కేలరీలు అధికంగా ఖర్చయ్యి, పొట్ట కొవ్వు త్వరగా కరుగుతుంది. ఈ చిట్కాలతో ఆరోగ్యకరమైన బరువును పొందవచ్చు.

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే సమస్య.. బాన పొట్ట. వయసుతో సంబంధం లేకుండా పలువురు తమ బానపొట్టను కరిగించుకోవటానికి రకరకాల డైట్లు, ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. అయితే, ఈ సమస్యకు వాకింగ్ అద్భుతమైన వ్యాయామం అంటున్నారు నిపుణులు. పొట్ట తగ్గాలనుకునేవారు కొన్ని పద్ధతుల్లో వాకింగ్‌ చేస్తే ఈజీగా పొట్టతగ్గుతుందని సూచిస్తున్నారు. పొట్ట తగ్గడం కోసం చేసే సాధారణ వాకింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వదు. కేలరీలు అధికంగా ఖర్చు కావాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. వేగంగా నడవడం, నెమ్మదిగా నడవడం, ఎత్తైన ప్రదేశాల్లో వాకింగ్, బరువులు మోస్తూ నడవడం, సరైన శరీర భంగిమ, మెట్లు ఎక్కడం వంటివి చేస్తే పొట్ట కొవ్వు సులువుగా కరిగి, బరువు అదుపులో ఉంటుందంటున్నారు. మెల్లగా లేదా వేగంగా ఇలా ఒకే విధంగా వాకింగ్‌ చేయడం వల్ల కేలరీలు ఖర్చుకావు. దీంతో పొట్ట తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రెండు నిమిషాలు నెమ్మదిగా నడిచి, ఓ నిమిషం పాటు వేగంగా నడవాలి. ఇలా పది నిమిషాలు చేయాలి. తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేలరీలు బాగా ఖర్చవుతాయి. పొట్ట సులువుగా తగ్గుతుంది. ఎత్తైన ప్రదేశాలు లేదా కొండలు ఎక్కడం ద్వారా వాకింగ్ కంటే ఎక్కువ కేలరీల ఖర్చు చేయవచ్చు. అందుకే వాకింగ్‌ కాస్త ఎత్తైన ప్రదేశంలో చేస్తే మంచిది. వారంలో కనీసం 3 రోజులు హైకింగ్‌ చేస్తే కేలరీల ఖర్చు పెరిగి పొట్ట తొందరగా తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. నార్మల్‌గా నడవటం వల్ల ఖర్చయ్యే కేలరీల కంటే బరువులు ఎత్తి నడిస్తే కేలరీలు మరింత ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే ముందుగా కాసేపు వాకింగ్ చేశాక 2-3 కేజీల బరువును బ్యాక్ ప్యాక్‌లో ఉంచి 10 నిమిషాలు వాకింగ్ చేయండి. బ్రేక్ తీసుకుని 30-40 నిమిషాలు ఇలా చేస్తే పొట్ట సులువుగా కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీ శరీర సామర్థ్యానికి తగిన బరువులు ఎంచుకోవడం ముఖ్యం. వాకింగ్ చేసేటపుడు మీ శరీర భంగిమ సరిగా ఉండటం చాలా అవసరం. నిటారుగా నిల్చుని, భుజాలను స్ట్రెయిట్‌గా ఉంచి నడవాలి. నడిచేటపుడు మీ పాదాలు మడిమతో సహా పూర్తిగా నేలను తాకేలా చూసుకోండి. దీనివల్ల కేలరీల ఖర్చు పెరిగి పొట్ట తగ్గించుకోవచ్చు. వాకింగ్‌లో ట్విస్టింగ్ ఉంటే మరీ మంచిది. దీనికోసం 5 నిమిషాలు వార్మప్ చేసి కాసేపు నార్మల్ వాకింగ్ చేయండి. తర్వాత ఒక్కో అడుగుకు ఒక్కో వైపు మీ అప్పర్ బాడీని వంచుతూ నడవండి. ఇలా 15 నిమిషాలు చేసి మరో 10 నిమిషాలు నార్మల్ వాకింగ్ చేయండి. తర్వాత బ్రేక్ తీసుకుంటే కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్ట తగ్గుతుంది. వాకింగ్ సమయంలో నేలపైనే కాకుండా మెట్లు ఎక్కడంపై కూడా ఫోకస్ చేయండి. దీనివల్ల కండరాలు బలపడటమే కాకుండా కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్టను సులువుగా కరిగించుకోవచ్చు. కనీసం 5-10 నిమిషాలు మెట్లు ఎక్కితే మేలు. మొదటి వారంలో చేసిన వాకింగ్ దూరం కంటే రెండో వారంలో కాస్త దూరం పెంచండి. రోజుకు 7 వేల అడుగులతో మొదలు పెట్టి 13వేల అడుగుల వరకు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా కేలరీల ఖర్చు పెరుగుతుంది. పొట్ట తగ్గుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్థాన్‌లో సూపర్‌ రిచ్ ఈ హిందూ మహిళ

ఛీ.. ఎంతకు తెగిస్తున్నార్రా.. అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ ఫేక్ వీడియో

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత