Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట
జపాన్‌లోని ఓవాకుడాని లోయలో, సల్ఫర్ అధికంగా ఉండే వేడి నీటిలో గుడ్లను ఉడకబెట్టినప్పుడు అవి నల్లగా మారతాయి. వీటిని 'కురో-తమాగో' లేదా జపనీస్ బ్లాక్ ఎగ్స్ అంటారు. ఈ గుడ్లను తింటే ఆయుష్షు 7-8 సంవత్సరాలు పెరుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు. సల్ఫర్ గుడ్డు పెంకుతో చర్య జరపడం వల్లే ఇవి నల్లగా మారుతాయి. ఈ వింతను చూడటానికి, గుడ్లు తినడానికి పర్యాటకులు వస్తుంటారు.
కోడి గుడ్లు సాధారణంగా తెల్లగా లేదా గోధుమరంగులో ఉంటాయి. అయితే నల్ల కోడిగుడ్డును ఎప్పుడైనా చూశారా ? ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాల్లో నల్ల కోడిగుడ్డు ఒకటి. జపాన్‌లో ఓ పెద్ద మరిగే లోయ ఉంది. దాని పేరు ఓవాకుడాని. 3000 ఏళ్ల క్రితం అక్కడి అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లోయ ఏర్పడింది. అయితే అగ్నిపర్వతం ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండటంతో అక్కడి చిన్న నీటి కొలనులు ఇప్పటికీ వేడి నీటిని విరజిమ్ముతుంటాయి. వాటిలో గుడ్లను ఉడకబెడితే అవి రంగు మారి నల్లగా అవుతున్నాయి. వాటిని ప్రత్యేక కురో-తమాగో గుడ్లుగా పిలుస్తారు. జపనీస్ బ్లాక్ ఎగ్ అని కూడా అంటారు. ఓవాకుడాని వేడినీటిలో ఉడికించిన గుడ్లను తింటే ఆయుష్షు 7-8 సంవత్సరాలు పెరుగుతుందనే నమ్మకం స్థానికుల్లో బలంగా ఉంది. ఆ వింతను చూడటానికి నల్ల గుడ్లను తినడం కోసం అక్కడకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. నల్ల గుడ్లు తినడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. కోడిగుడ్డులో ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఉడకబెడితే గుడ్డు నల్లగా ఎలా మారుతుందనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. అందుకు కారణం ఉంది. నిజానికి ఆ నీటిలో సల్ఫర్ అధిక మోతాదులో ఉంటుంది. ఆ నీరు గుడ్డు పెంకుతో కలిసినప్పుడు, అది నల్లగా మారుతుంది. గుడ్ల నుంచి సల్ఫర్ వాసన వస్తుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లిదండ్రుల హత్య కేసులో కూతురు సురేఖ అరెస్ట్
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన SIT