హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం

Updated on: Oct 25, 2025 | 1:12 PM

కర్నూల్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటుగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్న నవీన్‌, ప్రమాదం నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గాయపడ్డ వారికి సకాలంలో వైద్యం అందేలా చూసారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొంది. ఆ సమయంలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 19 మంది సజీవ దహనమయ్యారు. మిగతా ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అద్దాలు పగలగొట్టి బస్సు నుంచి బయటపడి ఆరుగురు ప్రాణాలను దక్కించుకున్నారు. ఆ ఆరుగురిని నవీన్ తన కారులో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గాయపడ్డ వారి పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఆయన మీడియాకు తెలిపారు. హిందూపూర్ నుంచి నంద్యాలకు తాను వెళుతుండగా బస్సు మంటల్లో దగ్ధమవుతూ కనిపించిందని నవీన్ చెప్పారు. బస్సులో నుంచి బయటపడ్డ ఆరుగురిని తన కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బస్సు చుట్టూరా మంటలు వ్యాపించాయని, వాహనాన్ని సమీపించే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. రమేశ్ అనే ఓ ప్యాసెంజర్ బస్సు అద్దం పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టు తెలిపారు. అది మనిషి పట్టేంత వెడల్పు కూడా లేకపోవడంతో కొందరికి గాజు గుచ్చుకుని గాయాలయ్యాయని అన్నారు. ఆరుగురు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఇక పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమా రెడ్డి.. బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి పోలీసులు సమాచారం అందించారు. బస్సును బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి పక్కకు పడిపోగా బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఈ క్రమంలో పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సును దగ్ధం చేశాయి. బస్సు డ్రైవర్లలో ఒకరు పరారవ్వగా.. మరొకరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్యపై జగన్‌ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు

Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు

కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం

శ్రీలీల కెరీర్ ఎక్కడ గాడి తప్పుతోంది

సీక్వెల్స్ బాట పడుతున్న సీనియర్ హీరో