సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె

Updated on: Mar 28, 2026 | 1:19 PM

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ప్రత్యేకంగా జరుగుతాయి. పేరిచెర్ల భీమరాజు దంపతులు 17 ఏళ్లుగా కొనసాగిస్తున్న 'కంతసారె' సంప్రదాయం ఇక్కడ కీలకం. 200 లీటర్ల పాల కోవా, 108 రకాల స్వీట్లతో సీతమ్మవారికి సమర్పించే ఈ సారె, క్షత్రియ వివాహ పద్ధతులను ప్రతిబింబిస్తుంది. శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో ఈ విశిష్ట పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

శ్రీరామనవమి వేడుకలంటేనే భక్తి, సంప్రదాయాల కలయిక. అయితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం గ్రామంలో సీతారాముల కల్యాణం చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సీతమ్మవారికి సమర్పించే ‘కంతసారె’ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. గత 17 ఏళ్లుగా పేరిచెర్ల భీమరాజు-సత్యవాణి దంపతులు ఈ అరుదైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. క్షత్రియ వివాహ సంప్రదాయాలను అనుసరించి, వధువు సీతమ్మవారికి వరుడు రామయ్య తరపున ఈ ‘కంతసారె’ను సమర్పిస్తారు. ఇందుకోసం సుమారు 200 లీటర్ల పాలతో తయారుచేసిన కోవాను ఉపయోగిస్తారు. గత 15 రోజులుగా స్థానిక మహిళల సహకారంతో 108 రకాల స్వీట్లు, పిండివంటలను సిద్ధం చేశారు. కేవలం స్వీట్లు మాత్రమే కాకుండా, పాలకోవతో అత్యంత నైపుణ్యంతో తయారు చేసిన ఈ స్వీట్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి పల్లకి, పర్ణశాల, శంకుచక్రాలు, గోవింద నామాలు, వివిధ రకాల పండ్లు, కూరగాయల ఆకారాలను కోవాతోనే తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టు వస్త్రాలను కూడా సారెగా సమర్పించారు. వైనతేయ గోదావరి నది తీరాన ఉన్న 70 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. కల్యాణం తర్వాత ఈ సారెను భక్తులకు ప్రసాదంగా పంచుతామని పేరిచర్ల వాణి తెలిపారు. కల్యాణం కోసం నదీ తీరాన ప్రత్యేకంగా దుబ్బిగడ్డితో పర్ణశాలను కూడా సిద్ధం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు

ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం

మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు

కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి

Follow Us