దొంగతనం అనుమానంతో.. పని వాళ్లను బంధించిన హీరో!

Updated on: Jun 27, 2026 | 10:10 AM

విడాకుల వార్తలతో తరచు వార్తల్లో నిలిచిన కోలీవుడ్ నటుడు జయం రవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని తన ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానంతో ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని నిర్బంధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల జోక్యంతో వారిని విడిపించి, జయం రవికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, దొంగతనం అనుమానంతో ప్రశ్నించామని, నిర్బంధించలేదని జయం రవి బృందం స్పష్టం చేసింది.

విడాకుల వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలిచే కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇప్పుడు మరో వివాదంతో తమిళనాట సంచలనం సృష్టిస్తున్నారు. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. చెన్నైలోని నీలాంకరై ప్రాంతంలో నివాసముంటున్న జయం రవి, తన ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో పనివాళ్లను బంధించినట్లు తెలుస్తోంది. పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారి బంధువులు జయం రవి ఇంటికి వెళ్లి చూడగా, పనివాళ్లను నిర్బంధించినట్లు గుర్తించారు. వారిని విడిచిపెట్టమని కోరినా హీరో నిరాకరించడంతో, కుటుంబ సభ్యులు నీలాంకరై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జయం రవి ఇంటికి చేరుకుని పనివాళ్లను విడిపించడమే కాకుండా, నటుడికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us