White hair or Hair fall: చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుందో తెలిస్తే షాకవుతారు..వీడియో

|

Feb 16, 2022 | 6:26 PM

White hair or Hairfall: 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడిపోవడం అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు ఎందుకు తెల్లబడిపోతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు.


White hair or Hairfall problems: 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడిపోవడం అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు ఎందుకు తెల్లబడిపోతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు. సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం.. జుట్టు నల్లబడటానికి కారణం మెలనిన్. ఇది జుట్టుకు రంగును ఇచ్చే వర్ణద్రవ్యం. శరీరంలో అది లోపించినప్పుడు జుట్టు రంగు తెల్లగా మారుతుంది. ఇదే నియమం మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.జుట్టు మూల భాగాలలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్‌ను సిద్ధం చేసి విడుదల చేస్తాయి. ఫలితంగా జుట్టు నల్లగా కనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి వృద్ధాప్య దశలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం దీని ప్రభావం వృద్ధుల్లోనే కాదు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయి. శరీరంలో పోషకాల కొరత, ధూమపానం, అనారోగ్యం, ఒత్తిడి వంటి కారణంగా తెల్లజట్టు వచ్చే అవకాశం ఉంటుంది. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి గల కారణాలు ఏమిటన్నదానిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జుట్టు నెరసిపోవడానికి ఒత్తిడి ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం అధ్యయనంలో కూడా రుజువైంది. ప్రజలు ఒత్తిడికి గురవడం వల్ల జుట్టు తెల్లగా మారడం, తర్వాత ఒత్తిడి నుంచి దూరరమైనప్పుడు వారి జుట్టు నల్లగా మారడం ప్రారంభమైంది. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఒత్తిడి జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని అధ్యయనం సమయంలో సాక్ష్యాలు కూడా సేకరించారు పరిశోధకులు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Published on: Feb 16, 2022 06:20 PM