Toll plaza: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ మోత..

|

Mar 15, 2023 | 8:51 PM

నేషనల్‌ హైవేలపై టోల్‌ మోత మోగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ చార్జీలను పెంచబోతోంది నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెంచి...

నేషనల్‌ హైవేలపై టోల్‌ మోత మోగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ చార్జీలను పెంచబోతోంది నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం మరోసారి భారీ బాదుడుకు సిద్దమైంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే వాహనదారులకు టోల్‌ భారం మోపడానికి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా… ఇప్పుడు టోల్‌ ట్యాక్స్‌ కూడా సామాన్యులకు భారంగా మరానుంది. ఈ టోల్ ట్యాక్స్ ధరలు 5 శాతం నుంచి 10 శాతం మేర పెంచాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయించినట్టు సమాచారం.టోల్‌ ద్వారా గతంలో వసూలైన మొత్తం, ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య ఆధారంగా టోల్‌ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. మార్చి నెలాఖరుకి దీనిపై నిపుణుల సూచనలు, అభిప్రాయం మేరకు కేంద్రప్రభుత్వం ఈ టోల్‌ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. సాధారణ వాహనాలకు ఎంత? భారీ వాహనాలకు ఎంత? అనే వివరాలతో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాణిజ్యేతర వాహనదారులు ప్రస్తుతం నెలవారీ పాసుకు 315 రూపాయల చెల్లించి ఎన్నిసార్లయినా ప్రయాణం చేసుకునే వీలుంది. తాజాగా వీటి ధరలను కూడా 10శాతం మేర పెంచే అవకాశముంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us on