Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

|

May 20, 2022 | 9:11 AM

రసాయనాలు ఉపయోగించి మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే ఉన్నా.. వాటిపై ఆకుపచ్చని మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే.. దాని రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది.


రసాయనాలు ఉపయోగించి మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే ఉన్నా.. వాటిపై ఆకుపచ్చని మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే.. దాని రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా సహజ సిద్దంగా పండిన మామిడి పండు నుంచి వచ్చే వాసన చాలా మధురంగా ఉంటుంది. కానీ కార్బైడ్ వేసి పండించిన మామిడి పండ్ల నుంచి ఎలాంటి వాసన రాదు. గుజ్జును పరిశీలిస్తే తెలిసిపోతుంది. కొందరు రసం తీసి చూపిస్తుంటారు. సహజ రీతిలో పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు కలిసిన పసుపు రంగులో ఉంటాయి. అదే కృత్రిమంగా మగ్గిన పండైతే.. గుజ్జు ముదురు పసుపు రంగులో ఉంటుంది. సహజంగా మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా తియ్యగా కూడా ఉంటుంది.ఇక తప్పదు.. అంతటా అవే దొరుకుతున్నాయి అనుకుంటే మీరు మరో చిట్కా ఉపయోగించవచ్చు కొంతలో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రసాయనాల ప్రభావం శరీరంలోకి చేరకుండా ఉప్పు నీటిలో కడిగి తొక్కు తీసి తినడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Gold in Sea: బీచ్‌లో బంగారం దొరుకుతుందట..! సముద్ర తీరానికి ఎగబడ్డ జనం..!

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 20, 2022 09:11 AM