Heart Balloon: గుండె వేగాన్ని నియంత్రించే ద్రాక్ష ఆకారపు బెలూన్..! యూకెలో నూతన ఆవిష్కారం..(వీడియో)
గుండె వేగంగా కొట్టుకుంటే ఆ ప్రభావం గుండెపై పడుతుంది. శాస్త్రీయ భాషలో దీనిని కర్ణిక దడ (atrial fibrillation) అంటారు. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం లేదా శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది.
గుండె వేగంగా కొట్టుకుంటే ఆ ప్రభావం గుండెపై పడుతుంది. శాస్త్రీయ భాషలో దీనిని కర్ణిక దడ (atrial fibrillation) అంటారు. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం లేదా శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు ద్రాక్ష ఆకారంలో బెలూన్‌ను రూపొందించారు. క్రమంగా గుండె కొట్టుకోవడానికి ఈ పరికరం సహకరిస్తుంది. దీనిని యూకే ఆరోగ్య సంస్థ NHS ఆమోదించింది. గుండె రోగులకు త్వరలో బెలూన్ పరికరంతో చికిత్స అందించవచ్చు. యూకేలో, 1.4 మిలియన్ల మంది ప్రజలు సక్రమంగా లేని హృదయ స్పందనతో బాధపడుతున్నారు. కొత్త బెలూన్ పరికరం రోగుల చికిత్సలో పెద్ద మార్పును తీసుకొస్తుందని భావిస్తున్నారు.
సాధారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం, దడ ఎక్కువగా 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో కనిపిస్తాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ధమనుల వ్యాధి, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధి, వైరస్ ఇన్ఫెక్షన్, నిద్రలేమి, కెఫిన్-పొగాకు లేదా ఆల్కహాల్ అధిక వినియోగం వీటికి కారణాలు. కాగా ఈ బెలూన్ 10 రకాల ఎలక్ట్రోడ్లతో ఉంటుంది. శస్త్రచికిత్స సమయంలో ఈ బెలూన్ గుండెకు అమర్చడంతో ఇది ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండెకు, దెబ్బతిన్న నరాలకు చేరవేస్తుంది. ఈ బెలూన్‌లోని సెన్సార్లు గుండె ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను నియంత్రిస్తాయి. ఈ టెక్నిక్ సహాయంతో కేవలం 10 సెకన్లలో గుండె చప్పుడును క్రమబద్ధీకరించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)
