Railway News: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. రైల్వే స్టేషన్ పేరుమార్పుపై భిన్న స్వరాలు.. (వీడియో)

|

Jan 28, 2022 | 9:33 AM

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. యూపీలోని ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు.


రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. యూపీలోని ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్‌గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం మీదున్న పాత నేమ్ బోర్డులను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చారు.

ఫైజాబాద్ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌కు పురాతనమైన చరిత్ర ఉంది.. దీన్ని అయోధ్య కంటోన్మెంట్‌గా పేరు మార్చడం సరికాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక ఫైజాబాద్ నగరం గుర్తింపును కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ పేరు మార్పు గందరగోళానికి గురిచేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.అయితే మరోవర్గం మాత్రం బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయోధ్య పేరును సమీపంలోని అన్ని ప్రాంతాల్లోనూ వాడాలని చెబుతున్నారు. రాముడి జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని మరో పేరుతో పిలవడం సరికాదంటున్నారు. ఇప్పటికే అయోధ్య స్టేషన్ ఉందని.. ఇప్పుడు కొత్తగా అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ పేరు ఏర్పాటు చేయడంతో ప్రజలు గందరగోళానికి గురైయ్యే అవకాశముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. శతాబ్ధానికి పైగా చరిత్రకలిగిన ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును మార్చడం సరికాదని అక్కడ కూలీగా పనిచేస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Jan 28, 2022 09:10 AM