Petrol and Vegetables Prices Video: పండగ వేళ కంగారు పెడుతున్న కూరగాయలు మరియు ఇంధనం ధరలు..(వీడియో)
దసరా పండుగపూట కూరగాయలు ధరలు దడ పుట్టిస్తున్నాయి..సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల నిరుత్సాహంతో దసరా వేడుకలు జరుపుకున్న ప్రజలు.. ఈసారి చుక్కలు చూపిస్తున్న నిత్యవసర వస్తువుల ధరలు చూసి హైరానా పడుతున్నారు...
దసరా పండుగపూట కూరగాయలు ధరలు దడ పుట్టిస్తున్నాయి..సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల నిరుత్సాహంతో దసరా వేడుకలు జరుపుకున్న ప్రజలు.. ఈసారి చుక్కలు చూపిస్తున్న నిత్యవసర వస్తువుల ధరలు చూసి హైరానా పడుతున్నారు… గత వారం, పది రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. హోల్‌సేల్‌లో కిలో 10 రూపాయలు పలికే టమోట ధర అమాంతం పెరిగి 40 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కరాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా ధరలు పెరిగిపోయాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూరగాయల ధరలు ఏకంగా 25 శాతం పెరిగిపోయాయి. భారీ వర్షాలు, ఇంధన ధరల పెరుగుదల వల్లే కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఉల్లి ధరలు కూడా వినియోగదారులకు కంటనీరు పెట్టిస్తున్నాయి. కర్నాటకలోని శివమొగ్గలో ఉల్లి కేజీ 40 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. కూరగాయలే కాదు.. నూనెలు, తృణధాన్యాలు ఇలా అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి.
మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 104 రూపాయలు దాటింది. డీజిల్ 94 రూపాయలకు చేరుకుంది. మహారాష్ట్రలో లీటరు పెట్రోలు 110 రూపాయలు ఉండగా డీజిల్ లీటరు ధర 102 రూపాయలకు చేరువలో ఉంది. ఇలా ఇంధన ధరలపెరుగుదల నేరుగా నిత్యావసర సరుకుల ధరలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకీ సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజలు ఆవేదనచెందుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Pooja Hegde video: నాలో అలంటి మార్పులు చాలా వచ్చాయి.. బుట్టబొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!(వీడియో)
Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్ ఫెస్ట్ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..
: Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..