Papaya: బొప్పాయి తినేవారికి హెచ్చరిక..! ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదు..(వీడియో)

|

Dec 29, 2021 | 10:06 PM

ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయి అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. దీన్ని సలాడ్‌లలో కలుపుకొని తినవచ్చు. బొప్పాయి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.


ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయి అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. దీన్ని సలాడ్‌లలో కలుపుకొని తినవచ్చు. బొప్పాయి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదయం లేదా భోజనం తర్వాత దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి బాధలు తగ్గుతాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, తక్కువ రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే కొంతమంది మాత్రం బొప్పాయి అస్సలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందాం.గర్భిణీల ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ బొప్పాయి పండుని ఈ జాబితా నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. ఈ పండులో లేటెక్స్ ఉంటుంది ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల నెలలు నిండకముందే ప్రసవానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది పాపైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది పిండానికి మద్దతు ఇచ్చే పొరను బలహీనపరుస్తుంది. సగం పండిన బొప్పాయిల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు కానీ మీరు ఇప్పటికే గుండె సమస్యలని ఎదుర్కొంటున్నట్లయితే దీనిని తినకపోవడమే మంచిది. బొప్పాయిలో తక్కువ మొత్తంలో సైనోజెనిక్ గ్లైకోసైడ్ ఉంటుంది. హృదయ స్పందన సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఇది హైపోథైరాయిడిజంతో బాధపడేవారిపై ఇదే ప్రభావాన్ని చూపుతుంది. అలెర్జీతో బాధపడుతున్న వ్యక్తులు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో చిటినాసెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్‌ల వల్ల తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కళ్ళలో నీరు కారడానికి దారితీస్తుంది.

Follow us on