తల స్నానానికి అష్టకష్టాలు..! వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియో..! :Astronauts Wash Hair Video.

|

Sep 04, 2021 | 12:18 PM

కృత్రిమ వాతావరణంలో స్పేస్‌ స్టేషన్‌లో నెలల తరబడి నివసించే వ్యోమగాములు తినే ఆహారం నుంచి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవలే పిజ్జాను ఎలా తయారు చేసుకుంటారో వీడియోను చూసి నమ్మలేకపోయాం. తాజాగా అంతరిక్షంలో తాము జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటామన్న విషయాన్ని తెలుపుతూ ఓ ఆస్ట్రోనాట్‌ వీడియో షేర్‌ చేశారు.

కృత్రిమ వాతావరణంలో స్పేస్‌ స్టేషన్‌లో నెలల తరబడి నివసించే వ్యోమగాములు తినే ఆహారం నుంచి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవలే పిజ్జాను ఎలా తయారు చేసుకుంటారో వీడియోను చూసి నమ్మలేకపోయాం. తాజాగా అంతరిక్షంలో తాము జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటామన్న విషయాన్ని తెలుపుతూ ఓ ఆస్ట్రోనాట్‌ వీడియో షేర్‌ చేశారు.మేగన్ మెకార్థర్ అనే ఆస్ట్రోనాట్‌ ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు.. ‘వ్యోమ గాములు తమ జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటారని.?’ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా తాను అంతరిక్షంలో తలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘వ్యోమగాములు అందరిలా నీటితో హెడ్‌ బాత్‌ చేయలేరు. దీనివల్ల నీరు ఎటు పడితే అటు వెళ్లి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇక ఈ వీడియో గమనిస్తే ఆస్ట్రోనాట్స్‌ జీవన విధానం ఇంత కష్టంగా ఉంటుందా అని అర్థమవుతోంది. ఒక ప్రత్యేకమైన షాంపూను ఉపయోగించి, తక్కువ నీటితో శుభ్రం చేసుకుంటారు. అలాగే నీరు బయటకు పోకుండా టవల్‌ను అడ్డుగా పెట్టుకొని కష్టపడుతోన్న తీరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


మరిన్ని ఇక్కడ చూడండి: చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

బంగారు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఓ సినిమా…! నయన్ ముందుగా పిలిచే పేరే సినిమా టైటిల్..(వీడియో): Nayanthara Video.

మిలిట్రీ శునకాలను అఫ్గాన్‌లోనే వదిలిన అమెరికాపై ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!(వీడియో): US Military Dogs.

తెనేటీగాల మురిపిస్తున్న బుల్‌డాగ్‌.. మరిన్ని రంగు రంగుల దుస్తుల్లో బుజ్జి కుక్కపిల్ల..: Dog Viral Video.