Facebook To Fuel Further Unrest: తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ ఫేస్‌బుక్ స్థానిక భాషల నిపుణుల కొరత.. (వీడియో)
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఫేస్‌బుక్’ తీవ్ర ఇబ్బందుల్లో పడింది! చిన్నారులు, సమాజంపై చూపే ప్రతికూల ప్రభావాలు బయటకు తెలియకుండా దాచిపెడుతోందని సంస్థ మాజీ ఉద్యోగి ఆరోపించారు. అంతేకాదు...
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఫేస్‌బుక్’ తీవ్ర ఇబ్బందుల్లో పడింది! చిన్నారులు, సమాజంపై చూపే ప్రతికూల ప్రభావాలు బయటకు తెలియకుండా దాచిపెడుతోందని సంస్థ మాజీ ఉద్యోగి ఆరోపించారు. అంతేకాదు ‘ఫేస్‌బుక్ పత్రాలు’ పేరిట కీలక పత్రాలను బయటపెట్టారు. చిన్నారులకు ఫేస్‌బుక్ ఏ విధంగా హానికరంగా మారే ముప్పుంది? రాజకీయ హింసను ప్రేరేపించే పోస్టులకు ఫేస్‌బుక్ ఎలా కారణమయ్యే అవకాశాలున్నాయి? వంటి ప్రశ్నలతో ఫేస్‌బుక్ పరిశోధనలు నిర్వహించింది. వివరాలు మాత్రం పెట్టుబడిదారులు, ప్రజల కంటపడకుండా దాచేస్తోంది.
ప్రపంచాన్ని ఫేస్‌బుక్ మరింత మెరుగైన ప్రదేశంగా మారుస్తోందని తమ ఉద్యోగుల్లో ఎంతమంది భావిస్తున్నారో తెలుసుకునేందుకు ఆ సంస్థ తరచూ సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఒకప్పుడు కనీసం 70% మంది ఉద్యోగులు ఆ ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చేవారు. ఇటీవల అది 50 శాతానికి పడిపోయింది. ఫేస్‌బుక్‌లో విద్వేష ప్రచారం కొనసాగుతుండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి- స్థానిక భాషలకు సంబంధించి సంస్థలో నిపుణులు లేకపోవడం. అఫ్గానిస్థాన్, మయన్మార్‌లో విద్వేష ప్రచారానికి సంస్థ అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫేస్‌బుక్ చాలా సార్లు నిర్వహించిన అంతర్గత పరిశోధనలకు సంబంధించిన వేల కొద్దీ పత్రాలు ఆ సంస్థ మాజీ ప్రొడక్ట్ మేనేజర్ ఫ్రాన్సెస్ హాగెన్ దగ్గర ఉన్నాయి. ఆమె విజిల్ బ్లోయెర్‌గా మారి వాటిని బయటపెట్టారు. అమెరికా చట్టసభ- కాంగ్రెస్‌కు కూడా సమర్పించారు. వాటినే ఫేస్‌బుక్ పేపర్లుగా పిలుస్తున్నారు. ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ సహా అమెరికాకు చెందిన 17 వార్తాసంస్థలు వాటిపై వరుస కథనాలను ప్రచురిస్తున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..