Anaivari Waterfalls: కళ్లముందే ప్రళయం..! బండరాళ్లపై చిక్కుకుపోయిన తల్లీ బిడ్డలు.. నెట్‌లో వైరల్ వీడియో..
తమిళనాడులోని అనైవారి జలపాతాల వద్ద ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఒక మహిళతోపాటు ఓ చిన్నారిని ప్రాణాలకు తెగించి రక్షించారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తమిళనాడులోని అనైవారి జలపాతాల వద్ద ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఒక మహిళతోపాటు ఓ చిన్నారిని ప్రాణాలకు తెగించి రక్షించారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆ గ్రామస్థులు చేసిన సాహసాన్ని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
తమిళనాడులోని అనైవారి జలపాతానికి టూరిస్టులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన బిడ్డతోపాటు వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. పర్యాటకులు చూస్తుండగానే జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అప్పటి వరకు జలపాతం నీటిలో ఆడుకుంటున్న జనం పరుగులు పెట్టారు. అయితే అటువైపు ఓ బండ రాయిపై కూర్చుని చూస్తున్న ఆ మహిళ అక్కడే ఉండిపోయింది. దీంతో స్థానికులు ప్రాణాలకు తెగించి ఆ మహిళను రక్షించారు. అందరి నడుములకు ఉన్న బెల్టులను ఓ తాడుగా మార్చారు. వాటి సహాయంతో ఆ ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తల్లి బిడ్డల్నీ కాపాడే ప్రయాత్నంలో ఓ ఇద్దరు గ్రామస్థులు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. కానీ, వారు ఈదుకుంటూ సమీపంలోని ఒడ్డుకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనైవారి జలపాతాలు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. కాగా, జరిగిన ఈ ఘటనతో అధికారులు జలపాతం వద్ద తాత్కాలికంగా నిషేధం విధించారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

