Coconut Water: ఈ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..?(వీడియో)
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ లాంటి పోషకాలు అధికంగా ఉండటంతో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా తాగడం మంచిది. రెగ్యూలర్గా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ లాంటి పోషకాలు అధికంగా ఉండటంతో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా తాగడం మంచిది. రెగ్యూలర్గా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇవే కాకుండా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ప్రమాదం. కానీ అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా…ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాస్తవానికి కొబ్బరి నీళ్ల ప్రభావం చల్లగా ఉంటుంది. దీంతో జలుబు సమస్య మరింత తీవ్రతరమవుతుంది. చల్లటి పదార్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. మెటబాలిజం రేటు పెరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. సాధారణంగా పొట్ట ఉబ్బరం సమస్యతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే ముందుగా వైద్యుడి సలహాలు తీసుకోవాలి.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

