Potato Juice: పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! ఈ ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం..(వీడియో)

Updated on: Nov 17, 2021 | 9:49 AM

పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! బంగాళదుంప మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి.


పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! బంగాళదుంప మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో విటమిన్ బి, సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో నెం.1గా పనిచేస్తుంది. చర్మసంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి జలుబు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పరగడుపున ఒక గ్లాసు బంగాళాదుంప రసం తాగితే ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నొప్పి ఉన్న ప్రదేశంలో బంగాళాదుంప ముక్కతో రుద్దితే నొప్పి తగ్గుతుందట.

బంగాళాదుంప రసం అల్సర్లను తగ్గించడమే కాదు… కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రపరిచే డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. హెపటైటిస్ చికిత్సకు జపాన్‌లో బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తారని ఓ అద్యయనం తెలిపింది. ఇందులో ఉండే పైబర్‌ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో శరీరాన్ని శక్తివంతంగా చేయడంలో సహాయపడతాయి అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 17, 2021 09:41 AM