Super Earth video: 70 రెట్లు పెద్దదైన మరో భూగ్రహం.. అక్కడ ఏడాదికాలం 11 రోజులే.! సూపర్ ఎర్త్..
భూమి కంటే అత్యంత పెద్దదైన ఓ ‘మహాభూమి’ ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరవ్యవస్థకు అవతల కనిపించిన ఈ భూమి మన భూమి కంటే 70 రెట్లు పెద్దది. అంతేకాదు ఐదు రెట్లు బరువైనది కూడా.
భూమి కంటే అత్యంత పెద్దదైన ఓ ‘మహాభూమి’ ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరవ్యవస్థకు అవతల కనిపించిన ఈ భూమి మన భూమి కంటే 70 రెట్లు పెద్దది. అంతేకాదు ఐదు రెట్లు బరువైనది కూడా. దీనిపై లోతైన సముద్రాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ గ్రహంపై సంవత్సర కాలం అంటే 11 రోజులు మాత్రమేనని చెబుతున్నారు. ఈ భూగ్రహం రెండు సూర్యుళ్లను కలిగి ఉందని, ఒకదాని చుట్టూ ఈ భూమి తన భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుండగా, మరోదాని చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఈ భూమిని కనుగొంది. ఇక ఈ భూమిని సూపర్ ఎర్త్ గా చెబుతున్న దీనికి టీవోఐ-1452బి అని పేరు పెట్టారు. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS), భూ ఆధారిత టెలిస్కోప్‌ల పరిశీలన సమయంలో ఈ గ్రహాన్ని గుర్తించారు. ఈ సూపర్ ఎర్త్ హైడ్రోజన్, హీలియంతో కూడిన రాతి గ్రహం అయి ఉండొచ్చని, దీనిపై వాతావరణం తక్కువగా, లేదంటే అసలు ఉండకపోవచ్చని అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాగా.. ఒక కాంతి సంవత్సరం అంటే.. దాదాపు 9 లక్షల 50 వేల కోట్ల కిలోమీటర్లు. ఈ లెక్కన 100 కాంతి సంవత్సరాలు అంటే.. ఇక ఊహించుకోనక్కర్లేదు. దీనిని బట్టి మనలాంటి భూమి మరోటి ఉందని మురిసిపోవడం తప్ప చేసేది ఏమీ లేదని అర్థమవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..
