NASA Accident: భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. కీలక మిషెన్‌ను ప్రయోగించబోతున్న నాసా.!(వీడియో)

ఇప్పటికే కరోనా వైరస్‌.. ప్రకృతి ప్రకోపాలు హడలెత్తిస్తుంటే.. ఇప్పుడు మరో ముప్పు ప్రపంచాన్ని కలవర పెడుతోంది. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్‌.. వరల్డ్‌ వైడ్‌గా హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. టైమ్‌ బాగుండి కొన్ని గ్రహశకలాలు సైడైపోతున్నాయి. కానీ..

NASA Accident: భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. కీలక మిషెన్‌ను ప్రయోగించబోతున్న నాసా.!(వీడియో)

|

Updated on: Nov 18, 2021 | 9:17 AM


ఇప్పటికే కరోనా వైరస్‌.. ప్రకృతి ప్రకోపాలు హడలెత్తిస్తుంటే.. ఇప్పుడు మరో ముప్పు ప్రపంచాన్ని కలవర పెడుతోంది. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్‌.. వరల్డ్‌ వైడ్‌గా హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. టైమ్‌ బాగుండి కొన్ని గ్రహశకలాలు సైడైపోతున్నాయి. కానీ.. తాజాగా దూసుకొస్తున్న ఓ గ్రహశకలం మాత్రం భయపెడుతోంది. తాజా ఆస్ట్రాయిడ్‌ భూమికి దగ్గరగా వచ్చి పోతుందా? లేదా ఢీ కొడుతుందా..? అసలు ఆ గ్రహశకలాన్ని అడ్డుకునే నాసా టెక్నాలజీ ఏమైనా ఉందా..?

అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఈ నెలలో ఒక వ్యోమనౌకను ప్రయోగించాలని భావిస్తోంది. కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించేందుకు ఈ ప్రయోగం చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీకొట్టి పరీక్షించనుంది. ఈ మిషన్ విజయవంతం అయితే భవిష్యత్తులో భూమి ఏదైనా ముప్పును ఎదుర్కొనేందుకు ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 23న స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించడానికి కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ సిద్దమవుతోంది. ఇది లక్ష్యాన్ని చేరుకునేందుకు సంవత్సరం సమయం పడుతుందని అంటున్నారు నాసా సైంటిస్టులు.
అయితే దశాబ్దాల కాలంగా గ్రహశకలాల వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను ఖగోళశాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల 70శాతం జీవరాశులు అంతరించిపోయాయి. గ్రహశకలాలు ఢీకొనడం వల్ల సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కార్చిచ్చులు వ్యాపిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ గ్రహశకలాల ప్రభావం ఒక్కటి మాత్రమే నివారించగల ప్రకృతి విపత్తు అని తెలిపింది. నాసా డార్ట్ చాలా జాగ్రత్తగా ఈ ప్రయోగాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించనుంది. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీ గ్రహశకలాల వేగం, మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. భూమికి ఇలాంటి విపరీత విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ఈ మిషన్ ద్వారా అవకాశం ఉంది.

ఈ గ్రహశకలం 330 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది డిసెంబర్ 11న భూమికి దగ్గరగా వస్తుంది. ఇది సెకండ్‌కి 6.58 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అంటే ఈ గ్రహశకలం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 90 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే వెళ్లగలదు. అయితే నాసా ఇంతలా కనిపెడుతున్నా… ఒక్కోసారి నాసా నుంచి కూడా కొన్ని గ్రహశకలాలు తప్పించుకుంటున్నాయి. అవి భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిపోతున్నప్పుడు నాసా గుర్తిస్తోంది. ఈ పరిస్థితి ఎందుకంటే… అంతరిక్షంలో కాంతి ఉండదు. అంతా చీకటే. దానికి తోడు గ్రహశకలాలు తక్కువ సూర్య కాంతిని ప్రసరిస్తాయి. పైగా అవి చిన్నగా ఉంటాయి. అందువల్ల వాటిని కనిపెట్టడం కష్టమవుతోంది. ఎనీహౌ… డిసెంబర్ 11న వస్తున్న గ్రహశకలం… ప్రశాంతంగా వచ్చి వెళ్లిపోతేచాలు.
మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us