నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
కింగ్ కోబ్రా.. పేరులోనే ఉంది.. అది పాములన్నింటిలోనూ ప్రత్యేకమని. రంగులోనూ, ఆకారంలోనూ, దాని తీరులోనూ పాములన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. ఎంతో చురుకుగా ఉండే ఈ కింగ్ కోబ్రా కాటు వేస్తే కాటికి వెళ్లాల్సిందే. అలాంటి భయంకరమైన ఈ కోబ్రా ఓ నర్సరీలో హల్‌చల్ చేసింది. నర్సరీలో పనులు చేసుకుంటున్న కూలీలు ఈ పాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
మన్యం జిల్లాలోని ఏజెన్సీ గ్రామమైన సీతంపేటలోని దుర్గా నర్సరీలో భారీ కింగ్ కోబ్రా సంచరిస్తూ నర్సరీ నిర్వాహకుల కంట పడింది. ఒక్కసారిగా అంత పెద్ద కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తక్షణం స్పందించిన అటవీశాఖ అధికారులు స్నేక్ క్యాచర్ ఖాన్‌ను వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఖాన్‌ను నర్సరీ చుట్టూ పరుగులు పెట్టించింది కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ కోపంతో రగిలిపోయింది. స్నేక్ క్యాచర్ దాని దృష్టి మళ్లించేందుకు చెప్పును చూపిస్తూ అటూ ఇటూ ఆడించగా ఒక్కసారిగా నోటితో చెప్పును లాగేసుకుంది. దాని నోటి నుండి చెప్పును బయటకు తీయటానికి ముప్పు తిప్పలు పడ్డ స్నేక్ క్యాచర్ చివరకు ఎంతో చాకచక్యంగా దానిని బంధించారు. కింగ్ కోబ్రాను తీసుకెళ్లి సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు టెన్షన్ పడ్డారు. తమ మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్ కపుల్.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో
ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో
