భర్త నుంచి హెచ్‌ఐవీ.. భార్య ఏం చేసిందో తెలుసా? వీడియో
కర్ణాటకలోని హోసూరులో ఓ కుటుంబంలో హెచ్‌ఐవీ చిచ్చు రేపింది. భర్తకు హెచ్‌ఐవీ సోకడంతో, భార్య, కుమారుడికి కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లి తన తొమ్మిదేళ్ల కుమారుడిని హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. హెచ్‌ఐవీ సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని జిల్లా ఎయిడ్స్ విభాగం అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని హోసూరు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో పరీక్షలు చేయించుకోగా అతనికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలో కలకలం రేగింది. అవాక్కైన అతని భార్య తన ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. పరీక్షల నివేదికల ప్రకారం, వారి కుమార్తెకు నెగటివ్ రాగా, తల్లికి, తొమ్మిదేళ్ల కుమారుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఈ వార్త వినగానే సదరు మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. సమాజంలో తలెత్తుకు జీవించలేమని భావించి, శనివారం అర్ధరాత్రి నిద్రపోతున్న తన కుమారుడిని దిండుతో నొక్కి హత్య చేసింది. అనంతరం తాను చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్ర లేచిన కుమార్తె కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
