దుర్గగుడి సిబ్బంది చేతివాటం.. గోల్డ్ నగలను రోల్డ్ గోల్డ్ పేరిట మళ్లింపు

Updated on: Apr 01, 2026 | 7:26 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో భారీ అక్రమం బయటపడింది. భక్తులు సమర్పించిన రూ.1.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొందరు సిబ్బంది రోల్డ్‌ గోల్డ్‌గా మార్చి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించగా, ట్రస్ట్ బోర్డు పట్టుకుంది. నిందితులపై ఈవో విచారణకు ఆదేశించారు. పారదర్శకత లేకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు.

బెజవాడ కనకదుర్గమ్మ అంటే భక్తులకు సాక్షాత్తు అమ్మ. తమను కాపాడే ఇలవేల్పుగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు.. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిస్తారు. తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తారు. బంగారం, వెండి, నగదు రూపంలో హుండీలో సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన బంగారు ఆభరణాలను కొందరు సిబ్బంది పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో వచ్చిన అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ గా చూపిస్తూ పక్కన పెట్టడం ఈ అక్రమార్కుల వ్యూహం. అయితే, అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు రూ. 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను పక్కన దాచినట్లు బయటపడింది. దీంతో నిందితులను అక్కడికక్కడే పట్టుకుని ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై దేవస్థానం ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందికి తక్షణమే మెమోలు జారీ చేయడంతో పాటు, సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. సీసీ కెమెరాల నిఘా, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ దేవుడి సొమ్ముకే కన్నం వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకత పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’

Loading...
Unable to load recommendations.
Follow Us