కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారంటూ బంక్ వద్ద నిరసన

Updated on: Dec 27, 2025 | 10:12 PM

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు కల్తీ పెట్రోల్‌పై ఆందోళన చేశారు. తమ వాహనాలు మొరాయిస్తున్నాయని నిరసన తెలిపారు. కాకినాడ డీఎస్ఓ తనిఖీలలో పెట్రోల్ నాణ్యతలో తేడాలు గుర్తించి, ఆ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలో కల్తీ పెట్రోల్‌పై తీవ్ర నిరసన వ్యక్తమైంది.

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలో కల్తీ పెట్రోల్‌పై తీవ్ర నిరసన వ్యక్తమైంది. వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడి ఆందోళన చేపట్టారు. బంక్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన వాహనదారులు, కల్తీ పెట్రోల్ కారణంగా తమ వాహనాలు తరచుగా మొరాయిస్తున్నాయని ఆరోపించారు. మొరాయించిన వాహనాలను తిరిగి బంక్ వద్దకు తీసుకొచ్చి, నిరసనను ఉధృతం చేశారు. ఈ విషయంపై స్పందించిన కాకినాడ డీఎస్ఓ అధికారులు, పెట్రోల్ బంక్‌లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పెట్రోల్ నాణ్యతలో స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట