Kadapa: చూడ్డానికి ఇలా ఉన్నాడు.. ఏకంగా మహిళా ఉద్యోగిని ఇంటికి వెళ్లి..

Updated on: Jan 24, 2025 | 2:38 PM

వయస్సు దగ్గరదగ్గర 60కి చేరువలో ఉంటుంది. ఇంకో రెండు మూడేళ్లు అయితే రిటైర్ అయిపోతాడు. అయినా కానీ ఈయనగారికి ఒంట్లో పైత్యం తక్కలేదు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిపై కన్నేశాడు. ఆమెను వశం చేసుకోవడానికి పిచ్చి ప్రయత్నాలు చేశాడు. ఏకంగా ఆమె ఇంటికే వెళ్లాడు. దీంతో బడితపూజ జరిగింది.

కామంతో చెలరేగిపోతున్న కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డికి బడితెపూజ జరిగింది మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో చంద్రశేఖర్‌రెడ్డిని చితకబాదాడు ఆమె భర్త.  ఇంటికెళ్లిమరీ కోరిక తీర్చమంటూ మహిళా ఉద్యోగిని వేధించాడు డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి డీటీసీ వేధింపుల్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో రవాణా కార్యాలయానికి వెళ్లి చంద్రశేఖర్‌రెడ్డిని చితకబాదారు కుటుంబసభ్యులు.  బాధితురాలి కాళ్ల మీదపడి వేడుకోవడంతో చంద్రశేఖర్‌రెడ్డిని వదిలిపెట్టారు అయితే, విషయం బయటికి రాకుండా ఉద్యోగులను మేనేజ్‌ చేశారు చంద్రశేఖర్‌రెడ్డిజ  కానీ, బాధితురాలి ఫిర్యాదుతో డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిపై వేటేసింది ప్రభుత్వం. హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించింది.  ఇదొక్కటే కాదు.. చంద్రశేఖర్‌రెడ్డి వేధింపులు చాలా బయటికి వస్తున్నాయి. చంద్రశేఖర్‌రెడ్డి లైంగిక వేధింపులతో చాలామంది మహిళా ఉద్యోగినులు బదిలీపై వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి