Jubille Hills Result Live: జూబ్లీహిల్స్‌‌లో విజయం దిశగా కాంగ్రెస్.. పార్టీ శ్రేణుల సంబరాలు

Updated on: Nov 14, 2025 | 11:19 AM

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ముందు పోస్టల్‌ ఓట్లు లెక్కింపు మొదలయ్యింది.. ఆ తర్వాత వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం తేలనుంది. సీసీకెమెరాల నిఘాలో కౌంటింగ్‌ జరుగుతోంది.

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ముందు పోస్టల్‌ ఓట్లు లెక్కింపు మొదలయ్యింది.. ఆ తర్వాత వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం తేలనుంది. సీసీకెమెరాల నిఘాలో కౌంటింగ్‌ జరుగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 డివిజన్‌లు ఉన్నాయి..

1. షేక్ పేట్ 2.యూసఫ్ గూడ, 3.సోమాజిగూడ, 4. ఎర్రగడ్డ, 5. బోరబండ, 6.వెంగళరావు నగర్, 7.రహమత్ నగర్

ఈ 7 డివిజన్‌ల పరిధిలో మొత్తం 407 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి

మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

ఏయే డివిజన్‌ ఎప్పుడు లెక్కిస్తారు.. అందులో ఉన్న పోలింగ్‌ బూత్‌లు ఎన్ని?

Round 1
ముందుగా షేక్ పేట్ డివిజన్‌తో లెక్కింపు ప్రారంభం అవుతుంది.
అందులో 42 బూత్స్ ఉన్నాయి

Round 2
రెండో రౌండ్‌లోనూ షేక్ పేట్‌ డివిజన్‌లో ఉన్న మరో 28 బూత్స్‌ లెక్కిస్తారు
ఎర్రగడ్డ డివిజన్‌లో 10 బూత్స్
వెంగళరావు డివిజన్‌లో 4 బూత్స్ లెక్కిస్తారు

Round 3
ఎర్రగడ్డ డివిజన్ 6 బూత్స్
రహమాన్ నగర్ డివిజన్ 28 బూత్స్
వెంగళరావు నగర్ 8 బూత్స్

Round 4
వెంగళరావు నగర్ డివిజన్ 26 బూత్స్
రహమత్ నగర్ డివిజన్ 16 బూత్స్

Round 5
రహమత్ నగర్ డివిజన్ 28 బూత్స్
వెంగళరావునగర్ డివిజన్ 14 బూత్స్

Round 6
వెంగళరావు డివిజన్ 6 బూత్స్
యూసఫ్ గూడ డివిజన్ 36 బూత్స్

Round 7
యూసఫ్ గూడ 22 బూత్స్
సోమాజిగూడ డివిజన్ 20 బూత్స్

Round 8
సోమాజిగూడ డివిజన్ 16 బూత్స్
ఎర్రగడ్డ డివిజన్ 8 బూత్స్
బోరబండ డివిజన్ 18 బూత్స్

Round 9
బోరబండ డివిజన్ 34 బూత్స్ .
ఎర్రగడ్డ డివిజన్ 8 బూత్స్

Round 10
ఎర్రగడ్డ డివిజన్ 29 బూత్స్

మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

Published on: Nov 14, 2025 08:18 AM