ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే.. సంతాన సాఫల్య కేంద్రాలు
దేశంలో సంతాన లేమితో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే వీధికో సంతాన పాఫల్య కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అయితే ఇక్కడ చికిత్స అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఇక చింత అక్కర్లేదు. సంతానం లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా...ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన సంతాన సౌఫల్య కేంద్రం మంచి ఫలితాలనిస్తోంది.
ఐవిఎఫ్ సెంటర్ ద్వారా పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ముగ్గురు మహిళలకు విజయవంతమైనట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రజిని రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రోజు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు. ఆస్పత్రిలోని సంతాన సౌఫల్య కేంద్రం ఐ వి ఎఫ్ సెంటర్ కు 20 మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో శంషాబాద్, నారాయణఖేడ్, హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు మూడు నెలల చికిత్స అనంతరం విజయవంతమైనట్లు ఆమె వివరించారు. సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వాసుపత్రిలో సంతాన సౌఫల్య కేంద్రం ఐవిఎఫ్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ విజయం వెనుక ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది కృషి ఎంతో ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ అమృతలక్ష్మి మరియు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sunita Williams: సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చూశారా ??
నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు
H-1B Visa: అమెరికన్ ఉద్యోగులకు H1B ముప్పు
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

