శిథిలాల దిబ్బ గాజాలో ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వీడియో

Updated on: Sep 20, 2025 | 3:53 PM

ఇజ్రాయెల్‌ దాడులతో గాజా శిథిలాల దిబ్బగా మారింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో.. ‘గాజా ప్రాంతం ఓ రియల్‌ ఎస్టేట్‌ బొనాంజా’ కావొచ్చని ఇజ్రాయెల్‌ ఆర్థికమంత్రి స్మాట్రిచ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. యుద్ధం తర్వాత గాజాను ఎలా విభజించాలనే దానిపై.. ఇప్పటికే అమెరికాతో చర్చలు ఆరంభించామని, దీనికి సంబంధించిన ఓ వ్యాపార ప్రణాళిక.. ట్రంప్‌ టేబుల్‌పై ఉందన్నారు.

గాజాలో కూల్చివేతలు పూర్తయ్యాయని, ఇక.. అక్కడ నిర్మాణం మొదలు కావాల్సి ఉందని స్మాట్రిచ్ చెప్పుకొచ్చారు. యుద్ధంలో ఇజ్రాయెల్‌, అమెరికా పెద్దమొత్తంలో ఖర్చు చేశాయి గనుక.. గాజాలో భూమిని అమ్మి.. దానిపై వచ్చే లాభాలను తమ రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంటుందని స్మాట్రిచ్‌ కామెంట్‌ చేసారు. గతంలోనూ.. ట్రంప్‌ గాజాను అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సైట్‌గా అభివర్ణించారు. పాలస్తీనీయులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే.. దాన్ని స్వాధీనం చేసుకుని, అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ ఏఐ వీడియోనూ విడుదల చేశారు. హమాస్‌ మాత్రం ఈ ప్రతిపాదనలను తీవ్రంగా తప్పుపట్టింది. కొనుగోలు చేసి.. అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని, పాలస్తీనాలో విడదీయలేని భాగమని తెలిపింది. ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ ఓఐసీ సభ్యదేశాలు ట్రంప్‌ ప్లాన్‌ను తిరస్కరించాయి.

మరిన్ని వీడియోల కోసం :

అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో

అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వీడియో

అంత్యక్రియలకు వెళ్లొస్తూ నలుగురు మృతి..వారి అంత్యక్రియలకు వెళ్లి మరో ముగ్గురు వీడియో

ఆగిన అంబులెన్స్.. దారిలోనే పోయిన ప్రాణం వీడియో