ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన

Updated on: Aug 12, 2026 | 2:20 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తమపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆర్థిక ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు, అమెరికా మరింత ఒత్తిడి పెంచుతామని హెచ్చరించగా, ఇరాన్ తన సైనిక వ్యవస్థలో కీలక నియామకాలు చేపట్టింది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ, అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు.అమెరికా దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడు ఆంక్షలనే ఆయుధంగా ఉపయోగిస్తుందని ఇరాన్ ఆరోపించింది. దశాబ్దాలుగా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ వాటి కారణంగా లొంగిపోయే పరిస్థితి లేదని బఘాయీ స్పష్టం చేశారు. ఇరాన్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

Loading...
Unable to load recommendations.
Follow Us